1. స్నేహ సంధ్య
ప. స్నేహ సంధ్యలో సేద తీరుచు
హితులమైతిమి అందరము స్నేహితులమైతిమి అందరము
సన్నిహితులమైతిమి అందరము
సన్నిహితులమైతిమి అందరము
అందరము మనమందరము
ఆనందముగా అందరము
ఆనందముగా అందరము
1. రాజు పేదను భేదమె తెలియక
వున్నదానితో తృప్తిని పొందుచు
సన్నిహితులకు సహాయపడుచు
చింతలేవియు చెంత చేరకనె
చింతలేవియు చెంత చేరకనె
సహనమునే పాటించెదము
శుభములనే కాంక్షించెదము
శుభములనే కాంక్షించెదము
2. మానవ సేవయె మాధవసేవ
మానవ సేవయె మనసుకు శాంతి
మానవ సేవయె మనసుకు శాంతి
అన్నదానమే అన్నిటమిన్న
అన్ని దానములు దయాగుణములే
అన్ని దానములు దయాగుణములే
దయగలవారే దానకర్ణులు
దయగలవారికి దాసోహమ్ము
దయగలవారికి దాసోహమ్ము
3. ముదిమివయసు మనకంటకుండగ
మనసునంతటిని శాంతపరచుకొని
అంతరమంతయు హాయిని నింపి
ప్రగతిపథాన పయనమునందుచు
దేశమునే ప్రేమించెదముదము
లోక శాంతినే కోరెదము
దేశమును ప్రేమించుమన్నా
మంచియనునది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్(గురజాడ 1910)
లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు.. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
రచన ,సంగీతం , గానం : కొడవంటి సుబ్రహ్మణ్యం
===================================2. సంధ్యా సమయపు సహచరులు
ప. సంధ్యా సమయపు సహచరులందరు
స్నేహ సంధ్యలో స్నేహితులైనారు
1. సాయంకాలపు చల్లని వేళల
సంధ్యానిలయము విందులు చేయగ
అరుదెంచిరి ఆత్మీయులందరును
హాయి గొలిపె ఆనందము పొంగె
2. మాటల మించిన మనసు గల వారు
సుమనస్కులు సువిశాల హృదయులు
పండుటాకులా కాదు పరువములు
నిండు యౌవ్వనులు వినూత్న రత్నములు
3. వింధ్య హిమాచల యమునా గంగ
ఉత్తుంగ తరంగ సేవా దురంధరులు
మలి సంధ్యలోని మాణిక్యములు
అందరి మన్ననలనందుకొనువారు
http://amrutam7.blogspot.com
http://senior789.blogspot.com
Phones: 0891 2740744, 0891 2547027, 9989719027